మిట్ట మధ్యాన్నం వేళ తన తల్లిని వెతుక్కుంటూ
ఆ లేగదూడ కీకారణ్యం లో సంచరిస్తూ
చాలా దూరం ముందుకు వెళ్ళిపోయింది
చుట్టూ చూస్తె ఒక్క చిన్న పిట్ట కూడా లేదు
అంత నిశ్శబ్దం
భయకరమైన ఆ నిర్మానుష్య ప్రదేశంలో
ఓ మర్రిచెట్టు నీడలో ఓ పెద్ద పులి చేతిలో గాయపడి
రక్తసిక్తమైన శరీరంతో ఓ గోమాత కనిపించింది.
లేగదూడ ఆతృత తో దగ్గరికి వెళ్లి చూసింది.
ఇంకెవరు ?
ఆ గోమాత తన తల్లే ..
రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటూ తన బిడ్డ ఎదుటే
మరణించింది.
లేగదూడ కళ్ళ వెంబడి అశ్రుధారలు జలజలా రాలాయి.
మర్నాడు ..
అదే ప్రాంతం
అదే కీకారణ్యం లో ఒక భయంకర తుఫాను
ఆ తుఫాను తాకిడి కి ఆ దట్టమైన అడవి సైతం
నిలువెల్లా కంపించింది.
చెట్లు నేల కూలాయి.
అదే సమయం లో ఓ మహావృక్షం నేలకూలి
అటు వైపు వస్తున్న ఓ పెద్దపులి
మీద పడింది.
తీగలు పెనవేసుకున్న ఆ వృక్షం చెర నుండి
విడిపించుకోలేక ఆ పులి ఆపసోపాలు పడుతూ
ఆర్ద్రత తో భీకరంగా గర్జించసాగింది.
ఆ చెట్టు ఇరుకున నలిగిపోతూ నరకయాతన ను
అనుభవిస్తున్న తన తల్లి ని చూసి పులికూన
కన్నీరు కారుస్తూ గొంతు పెగలక పోయినా
ఆతృత తో దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూనే వుంది.
కాని ఆ అరుపులు ఆ మలయమారుతపు హొరు లో
కలిసిపోయాయి.
Wednesday, June 10, 2009
Monday, June 8, 2009
భావావేశం
అది విశాఖపట్నం రామకృష్ణ బీచ్
సమయం సాయంత్రం ఆరున్నర ప్రాంతం
సముద్రం లో అలలు ఎగసి ఎగసి పడుతున్నాయి
ఓ ప్రియుడు తన ప్రియురాలి కోసం వేచి చూస్తున్నాడు
ఆమె ఎంతకీ రావడం లేదు
అతని ముఖ కవళికల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది
మొహం రంగులు మార సాగింది
ఏదో చేయాలని సంకల్పించాడు.
అటు ఇటు కొంతసేపు పచార్లు చేసాడు
మళ్ళీ ఇసుక పై జారగిలబడ్డాడు
అంతలో మళ్ళీ ఏదో ఆలోచన వచ్చి
జేబు లో నుంచి ఓ పేపరు తీసి దాని మీద
పెన్ను తో ఏదో రాయసాగాడు
అతని మనసు భావావేశం తో ఉప్పొంగసాగింది
ప్రియురాలినే మనసులో స్మరిస్తూ
కాగితం పై తన కవితా చాతుర్యాన్ని ప్రదర్శించసాగాడు.
ఇంతలొ వెనుకనుండి
రెండు చేతులు వచ్చి అతని కళ్ళని గట్టిగా మూసాయి
అప్పుడే అతని గుండెల్లో వీణలు మ్రోగాయి
తన్మయత్వం తో చేతులు విడిపించుకుని వెనక్కి తిరిగి చూసాడు
ఇప్పుడు అతని గుండె నిజంగానే బ్రద్దలయ్యింది
ఆడా మగా కాని ఓ "బృహన్నల" అతనికి దేవతల దర్శనమిచ్చింది.
సమయం సాయంత్రం ఆరున్నర ప్రాంతం
సముద్రం లో అలలు ఎగసి ఎగసి పడుతున్నాయి
ఓ ప్రియుడు తన ప్రియురాలి కోసం వేచి చూస్తున్నాడు
ఆమె ఎంతకీ రావడం లేదు
అతని ముఖ కవళికల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది
మొహం రంగులు మార సాగింది
ఏదో చేయాలని సంకల్పించాడు.
అటు ఇటు కొంతసేపు పచార్లు చేసాడు
మళ్ళీ ఇసుక పై జారగిలబడ్డాడు
అంతలో మళ్ళీ ఏదో ఆలోచన వచ్చి
జేబు లో నుంచి ఓ పేపరు తీసి దాని మీద
పెన్ను తో ఏదో రాయసాగాడు
అతని మనసు భావావేశం తో ఉప్పొంగసాగింది
ప్రియురాలినే మనసులో స్మరిస్తూ
కాగితం పై తన కవితా చాతుర్యాన్ని ప్రదర్శించసాగాడు.
ఇంతలొ వెనుకనుండి
రెండు చేతులు వచ్చి అతని కళ్ళని గట్టిగా మూసాయి
అప్పుడే అతని గుండెల్లో వీణలు మ్రోగాయి
తన్మయత్వం తో చేతులు విడిపించుకుని వెనక్కి తిరిగి చూసాడు
ఇప్పుడు అతని గుండె నిజంగానే బ్రద్దలయ్యింది
ఆడా మగా కాని ఓ "బృహన్నల" అతనికి దేవతల దర్శనమిచ్చింది.
స్నేహం
ఇద్దరు స్నేహితులున్నారు
ఆ ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడదు
అయినప్పటికీ వారిద్దరూ ఒకరిని విడిచి ఒకరు వుండలేరు
వారి స్నేహం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది
కొట్టుకున్నా, తిట్టుకున్నా వారిద్దరే
ఓడినా, గెలిచిన వారిద్దరే
ఆఖరి మజిలి వరకు వారిద్దరూ కలిసే వున్నారు
వారిని ఎవరు విడదీయలేకపోయారు
విడదీయాలని కొందరు ప్రయత్నించారు కూడా
అయిన వారు విడిపోలేదు
అంతటి అసామాన్యులు
అయినప్పటికీ అన్ని కథల్లో లాగానే
వీరు కూడా విడిపోవాల్సిన సమయం వచ్చింది
కాని వారు బాధ పడుతూ విడిపోలేదు
సంతోషంగా విడిపోయారు
వారిని విడదీసిన క్షణానికి వారు పెట్టుకున్న
పేరు "మరణం"
వారు చనిపోయాక వాళ్ళ పేర్లు శిలాఫలకాల పై
చెక్కబడ్డాయి
ఒక శిలాఫలకం పై "ఆత్మ" అని
మరో ఫలకం పై "అంతరాత్మ " అని చెక్కారు
యుగాలు మారినా
యుగంతాలు సంభవించినా
ఆ శిలాఫలకాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండానే వున్నాయి
ఆ ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడదు
అయినప్పటికీ వారిద్దరూ ఒకరిని విడిచి ఒకరు వుండలేరు
వారి స్నేహం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది
కొట్టుకున్నా, తిట్టుకున్నా వారిద్దరే
ఓడినా, గెలిచిన వారిద్దరే
ఆఖరి మజిలి వరకు వారిద్దరూ కలిసే వున్నారు
వారిని ఎవరు విడదీయలేకపోయారు
విడదీయాలని కొందరు ప్రయత్నించారు కూడా
అయిన వారు విడిపోలేదు
అంతటి అసామాన్యులు
అయినప్పటికీ అన్ని కథల్లో లాగానే
వీరు కూడా విడిపోవాల్సిన సమయం వచ్చింది
కాని వారు బాధ పడుతూ విడిపోలేదు
సంతోషంగా విడిపోయారు
వారిని విడదీసిన క్షణానికి వారు పెట్టుకున్న
పేరు "మరణం"
వారు చనిపోయాక వాళ్ళ పేర్లు శిలాఫలకాల పై
చెక్కబడ్డాయి
ఒక శిలాఫలకం పై "ఆత్మ" అని
మరో ఫలకం పై "అంతరాత్మ " అని చెక్కారు
యుగాలు మారినా
యుగంతాలు సంభవించినా
ఆ శిలాఫలకాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండానే వున్నాయి
Subscribe to:
Posts (Atom)



