Monday, June 8, 2009

భావావేశం


అది విశాఖపట్నం రామకృష్ణ బీచ్
సమయం సాయంత్రం ఆరున్నర ప్రాంతం
సముద్రం లో అలలు ఎగసి ఎగసి పడుతున్నాయి
ఓ ప్రియుడు తన ప్రియురాలి కోసం వేచి చూస్తున్నాడు
ఆమె ఎంతకీ రావడం లేదు
అతని ముఖ కవళికల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది
మొహం రంగులు మార సాగింది
ఏదో చేయాలని సంకల్పించాడు.
అటు ఇటు కొంతసేపు పచార్లు చేసాడు
మళ్ళీ ఇసుక పై జారగిలబడ్డాడు
అంతలో మళ్ళీ ఏదో ఆలోచన వచ్చి
జేబు లో నుంచి ఓ పేపరు తీసి దాని మీద
పెన్ను తో ఏదో రాయసాగాడు
అతని మనసు భావావేశం తో ఉప్పొంగసాగింది
ప్రియురాలినే మనసులో స్మరిస్తూ
కాగితం పై తన కవితా చాతుర్యాన్ని ప్రదర్శించసాగాడు.
ఇంతలొ వెనుకనుండి
రెండు చేతులు వచ్చి అతని కళ్ళని గట్టిగా మూసాయి
అప్పుడే అతని గుండెల్లో వీణలు మ్రోగాయి
తన్మయత్వం తో చేతులు విడిపించుకుని వెనక్కి తిరిగి చూసాడు
ఇప్పుడు అతని గుండె నిజంగానే బ్రద్దలయ్యింది
ఆడా మగా కాని ఓ "బృహన్నల" అతనికి దేవతల దర్శనమిచ్చింది.

2 comments:

  1. బాగుంది. కానీ చివర మీరు అలా ముగించి ఏమి చెపుదామనుకున్నారో అర్ధం కాలేదు.

    ReplyDelete
  2. naku indulo antarardham teliyaledandi!

    ReplyDelete