Thursday, June 11, 2009

యుద్ధ ఖైదీ


ఆ వృద్దుడు కొన్ని సంవత్సరాలుగా
చెరసాల లోనే మ్రగ్గుతున్నాడు.
ఎప్పుడు విముక్తి లభిస్తుందో తెలియదు.
అనేకనేక రోగాల బారిన పడి
జీవచ్ఛవం లా ఆ జైలు గోడలకే పరిమితమైపోయాడు.
ఆయినా ఏదో తెలియని కించిత్ గర్వం ఆ ముసలివాడి
కళ్ళలో సూచన ప్రాయంగా కనిపించసాగింది.
అనేక సంవత్సరాల క్రితం యవ్వనం లో ఆ వృద్దుడు
ఒక రాజ్యానికి అధిపతి
రాజసం ఉట్టిపడే తేజస్సు తో తన రాజ్యాన్ని పాలించేవాడు.
రాజదర్పం తో తన సౌఖ్యాల కోసం ప్రజలపై
ఎక్కువ శిస్తులు విధిస్తూ
ఈ రాజు మనకు భారం రా దేవుడా అని వారు అనుకొనేలా చేసాడు.
ఎందరో స్త్రీలను చెరపట్టాడు.
ఎందరో సజ్జనులను హింసించాడు.
అయినా కాలం అనేది ఎప్పడూ ఒకేలా వుండదు.
ఈ రాజు కంటే వెయ్యి ఏనుగుల బలం గల ఓ రాజ్యాధిపతి
దండెత్తి వచ్చి ఈ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు.
ప్రజలను హింసించే ఆ దుష్ట రాజు ను పట్టి బంధించాడు.
సర్వం కోల్పోయిన ఆ రాజు యుద్ధ ఖైదీ గా మారాడు.
అనేక సంవత్సరాలుగా జైలు గోడలకే అంకితమైపోయాడు.
ఎప్పుడు విముక్తి లభిస్తుందో కూడా తెలియని చోట
ఒక వైపు తన వృద్ద శరీరం నరకయాతన కు గురవుతున్నా
రాజసం అనే దర్పం తో ఆజ్ఞానమనే అంధకారం లో
అలమటిస్తూనే వున్నాడు.

5 comments:

  1. హైదరాబాదు [అప్పటి భాగ్యనగరమేమో] సంస్థానాథిపతి,నిజాం, మొగలులకు బందీగా చిక్కి కఠిన కారాగారంలో చీకటి గదుల్లో మగ్గి జీవితం ముగించిన వైనం గుర్తొచ్చింది. చదివి చాలా కాలమైంది అది కథో వాస్తవమో గుర్తు లేదు.

    ReplyDelete
  2. కదా సాగర్ గారు బాగా వ్రాస్తున్నారు ..అభినందనలు
    రాజసం అనే దర్పం తో ఆజ్ఞానమనే అంధకారం లో
    అలమటిస్తూనే వున్నాడు -ఇది బాగా నచ్చింది

    ReplyDelete
  3. బాగున్నాయి మీ చిట్టి కథలు.. ప్రయత్నాన్ని కొనసాగించండి..

    ReplyDelete
  4. సెలయేటి(చిన్ని) కధలలో సాగరమన్ని(బోలెడన్ని) కబుర్లు.....

    ReplyDelete
  5. కధాసాగర్ గారూ ! పేరుకు తగ్గట్టే మీ బ్లాగ్ ...కధల సమాహారం బావుంది . అభినందనలు .

    ReplyDelete