Sunday, March 27, 2011

వాళ్లిద్దరు...

వాళ్ళిద్దరికీ పరిచయమై 
ఏడాదికి పైనే కావస్తుంది 
ఆమె అంటే అతనికెంతో ఇష్టం
చాలా మంచి స్నేహితురాలు అని అనుకున్నాడు
అతనంటే ఆమె కు కూడా అంతే మక్కువ 
స్వచ్చమైన మైత్రికి మారుపేరు
ఇదేనేమో కదా అనుకుంది
ఇద్దరి అభిరుచులు వేరైనా అభిమతాలు ఒకటే
పరస్పరం ఒకరిని ఒకరు
గౌరవించుకుంటూ ఒకరి గురించి ఒకరు 
తెలుసుకుంటూ కాలాన్ని ఆనందంగా గడుపుతున్నారు
కానీ ఎవరికి వారే వారి యొక్క భవిష్యత్తు 
ప్రణాళికలు రూపొందించుకుంటూ జీవనాన్ని
కొనసాగిస్తున్నారు
వారు మంచి స్నేహితులైనా జీవన గమనం లో
ఎవరి దారులు వారివి
ఒక రోజు ఆమెకు ఒక సమస్య వచ్చింది 
ఆ సమస్య నుంచి బయట పడటానికి తన మిత్రుని 
సహాయం కోరింది
అతను కూడా స్నేహ ధర్మం తో ఆమెకు సహాయం చేయాలనే
సంకల్పించాడు
ఆ రోజు వాళ్ళిద్దరూ పార్కులో కలుసుకున్నారు
అదే రోజు ఫిబ్రవరి 14,ప్రేమికుల రోజు 
పార్కులో కలిసిన ఆ ఇద్దరు  స్నేహితులని ప్రేమికులుగా భావించిన
కొందరు సంస్కర్తలమని చెప్పుకొనేవాళ్ళు బలవంతంగా 
వివాహం చేసారు
వాళిద్దరూ విడిపోదామనుకున్నారు
కాని మనస్సాక్షి చంపుకోలేక కలిసే జీవించసాగారు 
ఒక్క సంవత్సరం గడిచింది
అదే పార్కులో ఒకటి కాబడిన ఆ యువజంట 
అదే పార్కులో ఆత్మహత్య కు ప్రయత్నించి 
అభాసుపాలయ్యింది.

3 comments:

  1. సత్యమో లేక కల్పితమో తెలియదు కానీ మీరు మలచిన తీరు బాగుంది!

    ReplyDelete
  2. ఏంటండీ చివర్న ఇంత ట్విస్ట్ ఇచ్చారు? పాపం! ఇది కల్పితం అవ్వాలని కోరుకుంటూ...

    ReplyDelete